తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందున ఈసారి తెలుగు ప్రపంచ మహాసభలను హైదరాబాద్ లో నిర్వహించడానికి తెరాస సర్కార్ సంసిద్దత వ్యక్తం చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి 10 రోజులపాటు తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలు, బాష, సాహిత్యం, కళలు అన్నీ ప్రతిభింబించేవిధంగా చాల గొప్పగా నిర్వహించాలనుకొంది. కానీ జూన్ 2 అష్టమి కావడం, ఎండలు కారణంగా నగరంలో వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉండటం చేత వాటిని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాటికి సెప్టెంబర్ 30వ తేదీన విజయదశమి రోజున అంకురార్పణ చేసి అక్టోబర్ 22 నుంచి 28 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సమయంలో అయితే నగరంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా నిర్వహిస్తున్న తెలుగు ప్రపంచ మహాసభలలో అందరూ పాల్గొని ఆస్వాదించగలరని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మరికొందరు సాహితీ ప్రముఖులు చేసిన సూచనను ముఖ్యమంత్రి కేసీఆర్ మన్నించి సభలను అక్టోబర్ కు వాయిదా వేశారు.