ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. జి.ఎస్.టి.బిల్లుకు ఆమోదం తెలిపేందుకు మాత్రమే ఈరోజు సమావేశం నిర్వహిస్తోంది కనుక దానికి ఆమోదముద్ర వేసిన వెంటనే ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడంపై తెదేపా, వైకాపాల మద్య యుద్ధం జరుగుతున్నందున వైకాపా ఆ అంశంపై సభలో చర్చకు పట్టుబట్టవచ్చు. జి.ఎస్.టి.బిల్లును ఉభయసభలలో ప్రవేశపెట్టి డానికి ఆమోదం తెలిపి సభను ముగించేస్తామని ముందే స్పష్టం చేసింది కనుక వైకాపా డిమాండ్ ను తెదేపా సర్కార్ పట్టించుకోకపోవచ్చు. ఈ ప్రత్యేక సమావేశం వెలగపూడిలో నిర్మించిన శాసనసభ భవనంలో ఉదయం 9.45 నుంచి ప్రారం అవుతాయి. సుమారు గంట సేపటిలోనే ఈ ప్రత్యేక సమావేశం ముగియవచ్చు.