తెదేపా ఎమ్మెల్సీ వాకాటిపై వేటు

 తెదేపా ఎమ్మెల్సీ వాకాటి నారయణ రెడ్డిని పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వాకాటి, ఆయన సంస్థలో మరికొందరు కలిసి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి బ్యాంకుల నుంచి ఏకంగా రూ.195 కోట్లు రుణాలు తీసుకొన్నారు. అది వడ్డీతో కలిపి రూ.205 కోట్లు అయ్యింది. బ్యాంకుల పిర్యాదు మేరకు సిబిఐ ఆయన ఇళ్ళలో నిన్న శోదాలు నిర్వహించింది. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన చంద్రబాబు నాయుడుకి ఈ విషయం తెలియగానే వాకాటి నిర్దోషిగా తేలేవరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.