ఆ పెన్షన్లకు మార్గదర్శకాలు జారీ

ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా మానవతా దృక్పధంతో ఆలోచించి రాష్ట్రంలో వివిధ కారణాలతో భర్తలకు దూరమై భారంగా జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళలకు నెలకు రూ.1,000 పెన్షన్ మంజూరు చేయాలని ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిని పొందేందుకు రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఈరోజు మార్గదర్శకాలు విడుదల చేసింది. అవి ఏమిటంటే:

1. కనీసం 18 ఏళ్ళు నిండిన వివాహిత స్త్రీలు.

2. కనీసం ఏడాది కాలం పాటు భర్తకు దూరంగా ఉన్నవారు.

3. గ్రామాలలో 30 ఏళ్ళు పైబడి వయసున్న అవివాహిత మహిళలు 

4. పట్టణాలలో 35 ఏళ్ళు పైబడి వయసున్న అవివాహిత మహిళలు కూడా ఈ పెన్షన్ పొందడానికి అర్హులే.

రాష్ట్రంలో కనుక ఒంటరి జీవనం సాగిస్తున్న మహిళలు తమ పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ లేదా సబంధిత అధికారులకు వీలైనంత త్వరగా సమర్పించి, తమ పేర్లను నమోదు చేసుకోవలసిందిగా కోరింది. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి ఈ పెన్షన్లు మంజూరు చేయడానికి అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.