ఉత్తమ ప్రశ్నలు-(1)

తెరాస అధికారంలోకి వచ్చిన తరువాతే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తొలగిపోయి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పలు చెప్పుకొంటుంటారు. కానీ మా కాంగ్రెస్ హయంలో తెలంగాణాతో సహా దేశ వ్యాప్తంగా అనేక విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నిర్మించడం వలననే నేడు దేశంలో 50,000 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతున్న మాట వాస్తవమా కాదా? ఆనాడు మేము ముందు చూపుతో ఆలోచించి నిర్మించిన విద్యుత్ సంస్థల వలననే నేడు రాష్ట్రానికి అవసరమైనంత విద్యుత్ సరఫరా అవుతున్న సంగతిని కేసీఆర్ ఎన్నడూ చెప్పడానికి ఇష్టపడరు,” అన్నారు ఉత్తం కుమార్ రెడ్డి. 

“ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా తెరాస మంత్రులు, నేతలు అందరూ తన గెడ్డం గురించే మాట్లాడుకొంటున్నారని ఉత్తం కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. “తెరాసలో ప్రస్తుతం నా గెడ్డం పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఎక్కడ సమావేశం అయినా నా గెడ్డం గురించి మాట్లాడుకుండా ఉండలేకపోతున్నారు. దానర్ధం ఏమిటి? అని ఉత్తం కుమార్ రెడ్డి సరదాగా ప్రశ్నించారు.