విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణా జెన్ కో, ట్రాన్స్ కో మరియు డిస్కంలలో 13,357 ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు ఆయన కార్యాలయం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. వీటిలో జూనియర్ లైన్ మ్యాన్ పోస్టు మొదలు డిస్కం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు గల ఖాళీలను భర్తే చేయబోతున్నట్లు ఆ ప్రకటనలో తెలియజేసింది. వీటిలో 1500 నాన్-టెక్నికల్ ఉద్యోగాలు కూడా ఉన్నట్లు ఆ ప్రకటనలో తెలియజేసింది. ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరుగబోతున్నందున జెన్ కో, ట్రాన్స్ కో మరియు డిస్కంలలో ఉద్యోగులకు పదోన్నతులు చేసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి అనుమతించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.