
ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిలో 9 మంది మిర్చి రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసి నిన్న అరెస్ట్ చేశారు. ఈ దాడికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై కూడా కేసు నమోదు చేశారు. ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన మండెపూడి ఆనందరావును ఈ కేసులో ఏ-1 ముద్దాయిగా, సండ్ర వెంకట వీరయ్యను ఏ-2 గా పేర్కొన్నారు. అందరిపై ఐపిసి సెక్షన్స్ 147, 148, 353, 427, 436, 448, 120(బి), రెడ్ విత్ 149 క్రింద కేసులు నమోదు చేసి నిన్న ఖమ్మం అధనపు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా వారికి న్యాయమూర్తి రెండు వారాలు రిమాండ్ విదించారు. తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై కేసు పెట్టినట్లు తెలియగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. రిమాండ్ విదించబడిన మిర్చి రైతుల పేర్లు: భూక్యా అశోక్, భూక్యా శ్రీను, ఇస్లావత్ బాలు, బాణోతు సైదులు, సత్తు కొండయ్య, నర్శింహారావు, ఉపేందర్, వెంకటేశ్వర్లు.