రేపు విద్యన్న అంత్యక్రియలు

ఈరోజు కన్ను మూసిన రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు అంత్యక్రియలు రేపు అంటే ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని అంబర్ పేట శ్మశానవాటికలో అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.