రైతులు మీ పక్షాన్నే ఉంటే విద్వంసం ఎందుకు చేశారు?

ఖమ్మం మార్కెట్ విద్వంసంపై అధికార, ప్రతిపక్షాల మద్య జోరుగా విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్నాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో నిన్న జరిగిన ఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో రైతులందరూ తమవైపే ఉన్నారని తెరాస సర్కార్ గొప్పలు చెప్పుకొని 24 గంటలు గడవక ముందే ఖమ్మంలో మిర్చి రైతులు ఎందుకు అంత విద్వంసం సృష్టించారు? వారి ఆవేదన, ఆగ్రహం ప్రభుత్వానికి కనిపించడం లేదా? మిర్చి రైతులకు క్వింటాలుకి రూ.10,000 చొప్పున ప్రభుత్వమే చెల్లించి మిర్చిని కొనుగోలు చేయాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.