3.jpeg)
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే కేసీఆర్, కేటీఆర్‌లను కాపాడుతోందని ఆరోపించారు. అయన మీడియాతో మాట్లాడుతూ, “ఫార్ములా1 రేసింగ్ కేసులో విచారణకు అనుమతించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు అనుమతించడం లేదు.
మేము అనుమతి కోరుతూ లేఖ వ్రాసి మూడు నెలలైంది. కానీ అయన ఇంత వరకు స్పందించలేదు. ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్’ ప్రకారం ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. లేకుంటే అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చేయగలరు.
ఈ కేసులో అవినీతి జరిగిందని ఖచ్చితమైన ఆధారాలు చూపించినా గవర్నర్ మమ్మల్ని అనుమతించలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా, రాహుల్ గాంధీలని తమ కార్యాలయానికి ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఓ ఏటిఎంలా వాడుకున్నారని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలే ఆరోపించారు కదా? మరి మేము సీబీఐ చేత విచారణ జరిపించాలని మేము కేంద్రానికి లేఖ వ్రాసినా ఎందుకు స్పందించడం లేదు?
బీజేపి, బీఆర్ఎస్ పార్టీల మద్య ఫెవీకాల్ బంధం ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?” అని ప్రశ్నించారు.
(వీడియో ఎన్టీవీ తెలుగు సౌజన్యంతో)