జగన్ హ్యాపీ! సిబిఐ కోర్టే కొట్టేసింది..

అక్రమాస్తుల కేసులలో ఏ-1 నిందితుడుగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ అధికారులు సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అంతే కాదు..ఆయన వచ్చే నెల 15 నుంచి జూన్ 15మద్యలో రెండు వారాలపాటు న్యూజిలాండ్ పర్యటించి వచ్చేందుకు కూడా సిబిఐ కోర్టు అనుమతించింది. 

జగన్ కు ఇది చాలా ఊరట సంతోషం కలిగించే విషయమే కానీ సిబిఐ అధికారులు వేసిన పిటిషన్ ను సిబిఐ కోర్టే కొట్టివేయడంతో వారు ఖంగుతిన్నారు. ఒకవేళ సిబిఐ కోర్టు జగన్ బెయిల్ ను రద్దు చేసి ఉంటే, ఆయన హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిబిఐ కోర్టు తీర్పుని పరిశీలించి నిర్ణయం తీసుకొనే వరకు జైల్లో గడుపవలసివచ్చేది. కానీ ఆయన విదేశీయాత్రలకు వెళ్ళేందుకు కూడా లైన్ క్లియర్ అయింది. ఆయన న్యూజిలాండ్ వెళ్ళబోతుంటే, సిబిఐ అధికారులు బహుశః హైకోర్టుకు పరుగులు తీస్తారేమో చూడాలి.