మంత్రి కేటిఆర్ తాజా ట్వీట్

ఈరోజు తెరాస 16వ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ ట్వీటర్ ద్వారా తెలంగాణా సాధనకు కృషి చేసినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణా సాధన కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమనాయకుడు కేసీఆర్ ఇప్పుడు ఉత్తమ పరిపాలకుడుగా మారారని ప్రశంసించారు. తెలంగాణా ప్రజల చిరకాలవాంఛ తీర్చిన గొప్ప ఉద్యమకారుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా కేటిఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కలర్ పెయింటింగ్ ను కూడా పోస్ట్ చేశారు.