కేసీఆర్ వరంగల్ పర్యటన షెడ్యూల్

ఈరోజు సాయంత్రం వరంగల్ నగరంలో జరుగుతున్న తెరాస ప్రగతి నివేదన సభకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరుతారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు వరంగల్ లోని  సుభేధారి ఆర్స్ట్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో దిగుతారు. అక్కడి నుంచి నేరుగా తెరాస ఎంపి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్తారు. సాయంత్రం 6 గంటలకి ప్రకాష్ రెడ్డి పేటలో సభాప్రాంతానికి చేరుకొంటారు. రాత్రి 8గంటలకు సభ ముగిసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్ళి రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం జనగాం జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో గల సోమేశ్వరాలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం సమీపంలోనే గలబమ్మెర పోతనామాత్యుని సమాధిని దర్శించుకొంటారు. శుక్రవారం పర్యటనలో జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మాణాలకు శంఖుస్థాపన, మిషన్ భగీరథ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు.