సింగరేణిలో ప్రమాదం, ఇద్దరు కార్మికులు మృతి

సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో ఈరోజు ఉదయం జరిగిన ఒక ప్రమాదంలో దేశిరెడ్డి రఘుపాల్ రెడ్డి (34), పవన్ అనే మరో కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందారు. వారిరువురూ మంచిర్యాల్ డివిజన్ లోని శ్రీరాంపూర్ నుంచి బదిలీ మీద ఈరోజే మణుగూరులో విధులలో చేరారు. వారు డ్యూటి ఎక్కిన కొద్ది సేపటికే ఉదయం 10.30గంటల సమయంలో  వారు పనిచేస్తున్న ప్రాంతంలోగల ఎం.ఓ.సీ.పీ.బంకర్ హటాత్తుగా కూలిపోయింది. వారిరువురూ దాని క్రింద నలిగి చనిపోయారు. హృదయవిదారాకరమైన ఈ ప్రమాదాన్ని చూసి కంటతడిపెట్టని వారు లేరు. వారిరువురూ తమ మృత్యువును వెతుకొంటూ ఇక్కడికి వచ్చారని అందరూ బాధ పడుతున్నారు. చనిపోయిన వారిలో దేశిరెడ్డి రఘుపాల్ రెడ్డి జనరల్ మజ్దూర్ కాగా, పవన్ బదిలీ కోల్ ఫిల్లర్ గా పనిచేస్తున్నాడు.