నేడు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ధర్నాలు

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ నేడు భాజపా రాష్ట్రా వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించబోతోంది. మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం అనుమతించనప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం ఓటు బ్యాంక్ ను ఆకర్షేందుకే ఈ బిల్లుని తీసుకువచ్చారని భాజపా రాష్ట్ర కార్యదర్శి సాంభమూర్తి అన్నారు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఈరోజు జిల్లా కలెక్టరేట్ల ముట్టడించి తమ నిరసనను తెలియజేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా స్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఒక నియంతలాగ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ తీసుకొంటున్నఇటువంటి స్వార్ద రాజకీయ నిర్ణయాల వలన ప్రజల మద్య చిచ్చు రగిలిస్తున్నారని విమర్శించారు. నియంతృత్వంగా వ్యవహరించడంలో కేసీఆర్ ను ఆయన ఇందిరాగాంధీతో పోల్చి, ఆమెకు పట్టిన గతే కేసీఆర్ కూడా పడుతుందని చెప్పడం విశేషం.