రాష్ట్రంలోని ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు ఉద్దేశ్యించిన బీసి-ఈ బిల్లు, తెలంగాణా హెరిటేజ్ యాక్ట్ బిల్లు, జి.ఎస్.టి.బిల్లుకు ఆదివారం తెలంగాణా శాసనసభ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ముస్లింలకు ఇస్తున్న 4శాతం రిజర్వేషన్ ను 12 శాతానికి, గిరిజనులకు ఇస్తున్న 6 శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూఈ బీసి-ఈ బిల్లులో ప్రతిపాదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ముస్లింలకు రిజర్వేషన్ల శాతం పెంచడంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఒకవేళ కేంద్రప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు పెంచడానికి సహకరించకపోతే, దానిని బ్రతిమాలుకోమని అవసరమైతే పార్లమెంటులో గట్టిగా నిలదీసి సాధించుకొంటామని కేసీఆర్ చెప్పారు.