జి.హెచ్.ఎం.సి.భోజనం మస్తుంది!

జి.హెచ్.ఎం.సి. ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాలలో హరే కృష్ణ ధార్మిక సంస్థ కేవలం రూ.5కే మంచి రుచికరమైన భోజనం అందిస్తోంది. ఇది నిరుపేదలు, రోజువారి కూలీలు, కార్మికులు, బిచ్చగాళ్ళకు ఒక వరం అనే చెప్పవచ్చు. జి.హెచ్.ఎం.సి.ఏర్పాటు చేసిన ఈ భోజన స్టాల్స్ గురించి తెలుసుకొన్న ఏపిలోని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డు నెంబర్: 12వద్ద ఏర్పాటు చేసిన ఈ భోజన కేంద్రంలో భోజనం చేశారు. తాను ఊహించిన దానికంటే ఆహరం చాలా రుచిగా ఉందని అన్నారు. తరువాత భోజనశాల నిర్వాహకులను కలిసి భోజనశాల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. తన మంగళగిరి నియోజకవర్గంలో కూడా తన స్వంత ఖర్చుతో అటువంటి భోజన కేంద్రం ఏర్పాటు చేయాలనుకొంటున్నానని చెప్పారు.