ఇటీవల 8 రాష్ట్రాలలో 10 శాసనసభ సీట్లకు జరిగిన ఉపఎన్నికలలో భాజపా విజయపధంలో దూసుకుపోతోంది. ఇంతవరకు వెలువడిన ఫలితాలలో పశ్చిమ డిల్లీలోని రాజౌరి గార్డెన్, హిమాచల్ ప్రదేశ్ లోని భోరంజ్, అసోంలోని దీమాజి శాసనసభ స్థానాలను భాజపా గెలుచుకొంది.
భాజపా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లోని అతేర్ మరియు బంధ్వా ఘర్, రాజస్తాన్ లోని ధోల్ పూర్ నియోజకవర్గాలలో భాజపా ఆధిఖ్యతలో ఉంది. అంటే 10 సీట్లలో 6 దక్కించుకొందన్నమాట.
దాదాపు రెండు దశాబ్దాల పాటు భాజపాకు దక్షిణాది కంచుకోటగా ఉన్న కర్నాటకలో మాత్రం ఇంకా ఎదురుదెబ్బలు తినక తప్పడం లేదు. నంజన్ గూడ్, గుడ్లుపేట్ నియోజక వర్గాలలో అధికార కాంగ్రెస్ ఆధిఖ్యతలో ఉంది.
తృణమూల్ కాంగ్రెస్ కోటలో పాగా వేయడానికి భాజపా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. పశ్చిమ బెంగాల్ లోని కాంతి దక్షిణ్ నియోజకవర్గంలో తృణమూల్ ఆధిఖ్యతలో ఉంది.
జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ లో వేర్పాటువాదులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి అల్లర్లకు పాల్పడటంతో ఈరోజు 38 పోలింగ్ కేంద్రాలలో మళ్ళీ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.