“కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక అసమర్ధుడు. ఆయనకు తన పార్టీపై ఏమాత్రం శ్రద్ధ లేదు. గోవాలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు దక్కినప్పటికీ ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు చురుకుగా ప్రయత్నించకపోవడమే అందుకు తాజా నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ప్రతీ ఎన్నికలలో వరుసగా ఓడిపోతున్నా ఆయన పట్టించుకోడు. అయన కాంగ్రెస్ పార్టీకి శల్యసారధ్యం చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో కనీసం 20 లోక్ సభ స్థానాలు కూడా దక్కించుకోవడం కష్టమే.” ఈమాటలు అన్నది ఇటీవల గోవా ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన విశ్వజిత్ రాణే.
ఆయన దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీల అసమర్ధతను ఈసడించుకొంటూ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ ద్వారా తను గెలుచుకొన్న ఎమ్మెల్యే సీటును కూడా వదులుకొని కొన్ని రోజుల క్రితమే భాజపాలో చేరిపోయాడు.