తెలంగాణా రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యామాలలో ప్రధానపాత్ర పోషించిన టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, తన అనుభవాలను ఓడిశాలో కోశల్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న ఉద్యమకారులతో పంచుకొనేందుకు ఓడిశాకు వెళ్ళారు. కోశల్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులు కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ తో మాట్లాడి తెలంగాణా ఉద్యమాలు, వాటిలో సాధకబాధకాలు, తెలంగాణా ఉద్యమాలు విజయం సాధించేందుకు అనుసరించిన వ్యూహాలు గురించి అడిగి తెలుసుకొన్నారు. కోశల్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల కోసం నేటి నుంచి ఓడిశాలో మూడు రోజుల పాటు జరుగబోయే సమావేశాలలో పాల్గొన వలసిందిగా కోరారు. వారి ఆహ్వానం మేరకు ఆయన ఒడిశా వెళ్ళారు.
అయన చర్య రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకిస్తున్న ఓడిశా ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించవచ్చు. కనుక ఆయన ఈ కోశల్ ఉద్యమాలకు దూరంగా ఉండటమే మంచిది.