తెలంగాణా లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో ఈరోజు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి సచివాలయంలో చర్చలు ఫలించడంతో గత వారం రోజులుగా సాగుతున్న లారీ ఓనర్స్ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల మద్య తిరుగుతున్న వాహనాలపై ఒక్కసారి మాత్రమే ప్రవేశపన్ను వసూలు చేయడం, చెక్ పోస్టుల ఆధునీకకరణ, ట్రక్కు యజమానులకు జాతీయ పర్మిట్ మంజూరులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం మరికొన్ని అంశాలపై ట్రక్కు యజమానులతో చర్చించినట్లు మంత్రి మహేందర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు సమ్మె విరమించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి సింగిల్ ఎంట్రీ టాక్స్ విధానం ప్రవేశపెడతామని చెప్పారు.