ఆ బోగస్ సర్వేలు దేనికంటే..

కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, తెరాస నేతల మద్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ సర్వేలన్నీ బోగస్ సర్వేలే..అవి సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి.. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయడానికే ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు. లేకుంటే కేసీఆర్ ఏ ప్రాతిపదికన ప్రజలు తన పార్టీని ప్రజలు మళ్ళీ ఎన్నుకొంటారని భావిస్తున్నారో చెప్పగలరా? అసలు ఈ రెండున్నరేళ్ళలో తెరాస సర్కార్ ఎన్ని హామీలను అమలుచేశారో చెప్పగలరా?తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కూడా బలవంతంగా డబ్బు వసూలు చేయడం చాలా దుర్మార్గం. సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో బారీ అక్రమాలు జరిగాయని మా పార్టీ చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాము. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మొదటి పంపు హౌస్ రీ-డిజైనింగ్ ను మేము వ్యతిరేకిస్తున్నాము. దాని వలన ప్రజాధనం వృధా కావడం తప్ప మరే ప్రయోజనం లేదు,” అని అన్నారు.