వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చెందిన కొన్ని బినామీ కంపెనీలతో సహా దేశ వ్యాప్తంగా నడుస్తున్న అటువంటి అనేక డమ్మీ కంపెనీల కార్యాలయాలపై ఈడి అధికారులు ఈరోజు దాడులు జరిపారు. ఈ ఒక్కరోజునే దేశవ్యాప్తంగా డిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్, కొచ్చి తదితర ప్రాంతాలలో ఈడి అధికారులు దాదాపు 700 డమ్మీ కంపెనీ కార్యాలయాలపై దాడులు జరిపి, ముఖ్యమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్లు వగైరా స్వాధీనం చేసుకొన్నారు. వాటి ద్వారా నల్లకుభేరులు తమ వద్ద పోగయిన నల్లధనాన్ని వైట్ గా మార్చుకొన్నట్లు గుర్తించమని ఈడి తెలిపింది. వాటిలో నవీ ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న రాజేశ్వర్ ఎక్స్ పోర్ట్స్ అనే డమ్మీ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి చెందిందిగా గుర్తించచామని, దాని అర్దికలావాదేవీలపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు ఈడి తెలిపింది.
దేశంలో నల్లకుభేరులు తమ వద్ద ఉన్న నల్లధనం బయటపెట్టేందుకు కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పధకాన్ని ప్రకటించింది. మార్చి 31వ తేదీతో దాని గడువు ముగిసిన మర్నాడే ఈడి అధికారులు దేశవ్యాప్తంగా ఒకేసారి ఇన్ని డమ్మీ కంపెనీలపై దాడులు చేయడం గమనిస్తే, నోట్ల రద్దు తరువాత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన నల్లకుభేరులను ఉద్దేశ్యించి చేసిన హెచ్చరికలను అమలుచేసి చూపించబోతున్నట్లు స్పష్టం అవుతోంది.
జగన్మోహన్ రెడ్డి నిత్యం తెదేపా ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు వేలకోట్ల అవినీతికి పాల్పడుతున్నారని విమర్శిస్తుంటారు. ఇప్పుడు ఆయన డమ్మీ కంపెనీపై ఈడి దాడులు చేయడమే కాకుండా అది జగన్మోహన్ రెడ్డికి చెందినదేనని ప్రకటించింది కూడా. దీనిని జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా సమర్ధించుకొంటారు?