తెరాస ప్లీనరీ ఎక్కడంటే...

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తెరాస నేతలతో ప్రగతి భవన్ లో సమావేశమైనప్పుడు తెరాస ప్లీనరీ తేదీ, వేదికను ఖరారు చేశారు. ఏప్రిల్ 21వ తేదీన కొంపల్లిలోని ఆర్.డి. కన్వెన్షన్ సెంటరులో ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. తెరాస వార్షికోత్సవం పురస్కరించుకొని ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ లో తెరాస బారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. కనుక ఏప్రిల్ 5లోపుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఏప్రిల్ 15లోగా జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నేతలను ఆదేశించారు.