
ఈరోజు ఉదయం నుంచి నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటి వరకు పూర్తయిన లెక్కింపు ప్రకారం పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బిజేపి, తమిళనాడులో 109 సీట్లతో టీవీకే పార్టీ (మ్యాజిక్ ఫిగర్ 118 చేరుకోవాల్సి ఉంది), కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అధికారంలోకి రాబోతున్నాయి.
ఈ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి, తమిళనాడులో తప్పక గెలుసస్తుందనుకున్న డీఎంకే.. దాని అధినేత సిఎం స్టాలిన్ ఓటమి అందరినీ ఆశ్చర్యపరిచాయి.
తమిళనాడులో ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా, కాంగ్రెస్, బిజేపి రెండు జాతీయ పార్టీలు ఎంతగా ప్రయత్నిస్తున్నా దశాబ్దాలుగా అన్నాడీఎంకే-డీఎంకేల మద్యనే అధికార మార్పిడి జరుగుతోంది. అలాంటి కొమ్ములు తిరిగిన పార్టీలని కొత్తగా రాజకీయాలలోకి అడుగుపెట్టి, తొలిసారిగా ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన కోలీవుడ్ హీరో విజయ్ దళపతి ఓడించి ముఖ్యమంత్రి కాబోతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.