
కోలీవుడ్ నటి త్రిష పుట్టిన రోజు నేడు. ఇది ఆమె జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని మధురాతి మధురమైన పుట్టినరోజుగా మిగిలిపోతుంది. ఆమె ప్రేమిస్తున్న కోలీవుడ్ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి ఆమె పుట్టిన రోజునాడే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో విజయం సాధించారు.
విజయ్ భార్య సంగీతతో విడాకులు పొందిన తర్వాత త్రిషని పెళ్ళి చేసుకోవడం దాదాపు ఖాయమనే అందరూ భావిస్తున్నారు. ఒకవేళ వారిద్దరూ పెళ్ళి చేసుకుంటే ఆమె భర్త ముఖ్యమంత్రి.. లేదా ఆమెకు ముఖ్యమంత్రి భార్యగా గౌరవ మర్యాదలు, కుదిరితే పార్టీలో, ప్రభుత్వంలో చోటు కూడా లభిస్తుంది. కనుక ఇది ఆమెకు అపురూపమైన పుట్టిన రోజు... పుట్టిన రోజు గిఫ్ట్ అని భావించవచ్చు.
అందుకే ఆమె సాటి సినీ నటులు, సినీ పరిశ్రమలో ప్రముఖులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంటే నిన్నటి వరకు ఒక లెక్క నేటి నుంచి మరో లెక్క అనుకోవచ్చు.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇన్స్టాగ్రామ్లో విష్ చేస్తూ “హ్యాపీ బర్త్ డే బేబీ... ఇది నీకు బెస్ట్ బర్త్ డే... లవ్ యూ,” అని అభినందనలు తెలియజేశారు. ఇంకా పలువురు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.