విజయ్‌ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారా.. లేదా?

తమిళనాడులో విజయ్‌ దళపతి నేతృత్వంలో టీవీకే పార్టీ 13 సీట్లు గెలుచుకొని మరో 95 స్థానాలలో ఆధిక్యంలో దూసుకుపోతోంది. కనుక 109 సీట్లు గెలుచుకోవడం ఖాయమే. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి మరో 9 సీట్లు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోగలిగితే అధికారంలోకి వస్తుంది. 

ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయినా ఆయనకు మద్దతు ఇచ్చి పదవులు, అధికారం దక్కించుకోవడం కోసం డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎలాగూ అయన పంచన చేరుతారు. లేదా మొదటి నుంచి ఆయనతో పొత్తుకి బిజేపి ప్రయత్నిస్తోంది కనుక అన్నాడీఎంకే-బిజేపి కూటమి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. 

కానీ టీవీకే పార్టీ 118 మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి కనుక వాటి మద్దతు అవసరం పడకపోవచ్చు. 

మధ్యాహ్నం 3.30 గంటల వరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో టీవీకే పార్టీ 13 సీట్లు గెలుచుకొని మరో 95 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. డీఎంకే 5 సీట్లు గెలిచి 65 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే 3 సీట్లు గెలుచుకొని మరో 53  స్థానాలలో ఆధిక్యంలో ఉంది.