తెలంగాణలో బిజేపి ఎన్నటికీ అధికారంలోకి రాలేదు!

తెలంగాణలో బిజేపి ఎన్నటికీ అధికారంలోకి రాలేదట! అవును ఈ మాటన్నది మరెవరో కాదు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌. 

బుధవారం నిజామాబాద్‌లో మంత్రి సీతక్కతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “నాడు దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి వేలాదిమంది నాయకులు పోరాడారు. 

కానీ దానిలో పాల్గొనని బిజేపి నేతలు కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మద్య చిచ్చు రగిలిస్తూ,  దేశాభ్యున్నతి గురించి మాట్లాడటం చాల హాస్యాస్పదంగా ఉంది. బిజేపి ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో ఎన్నటికీ అధికారంలోకి రాలేదు. 

అలాగే బీఆర్ఎస్‌ పార్టీ వస్తుందని కేసీఆర్‌, కేటీఆర్‌ పగటి కలలు కంటున్నారు.  కానీ వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ పార్టీయే వందకు పైగా సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఆ ఎన్నికలలో బిజేపికి 8 సీట్లే రావచ్చు. కల్వకుంట్ల కవిత అడుగుతున్న ప్రశ్నలకు కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు సమాధానాలు చెప్పడం లేదు?” అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ ప్రశ్నించారు.