సంబంధిత వార్తలు

నేడు పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ జోరుగా సాగింది. సాయంత్రం 6 గంటలకు గడువు ముగిసే సరికి క్యూ లైన్లలో ఉన్నవారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నారు. కానీ అధికారికంగా 6 గంటలకు గడువు ముగుస్తుంది కనుక వివిధ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. నాలుగు సంస్థలలో మూడు బిజేపి విజయం సాధిస్తుందని చెప్పగా పీపుల్ పల్స్ మాత్రం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పింది. కేరళలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, అస్సోం, పుదుచ్చేరిలో బిజేపి వచ్చే అవకాశాలున్నాయని సర్వే సంస్థలు అంచనా వేశాయి.