
నేడు పదవీ విరమణ చేస్తున్న తెలంగాణ డిజీపీ బి.శివధర్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే మరో పదవి ఇచ్చినట్లు సమాచారం. ఆయనకి క్యాబినెట్ హోదా కలిగిన రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించినట్లు తెలుస్తోంది. నేడు పదవీ విరమణ చేయగానే అయన ఈ కొత్త బాధ్యతలు చేపడతారు. మూడేళ్ళపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని సమాచారం.
నేడు పోలీస్ అకాడమీ గ్రౌండ్స్‌లో ఆయన గౌరవార్ధం నిర్వహిస్తున్న వీడ్కోలు సభలో ప్రసంగిస్తూ, ఈ 32 ఏళ్ళ పోలీస్ ఉద్యోగంలో అనేక అనుభవాలు, అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. పాత పోలింగ్ విధానం కాస్త కరుకుగా ఉండేది. దాని స్థానంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ విధానం ప్రవేశపెడితే మంచి స్పందన వచ్చింది. యువ పోలీస్ ఆఫీసర్లు అందరూ బాగా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డితో సహా పోలీస్ శాఖలో తనకు సహకరించి, ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ ఆయన పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకున్నారు.
ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ తెలంగాణ డిజీపీగా నియమితులైన సంగతి తెలిసిందే.