
కోలీవుడ్ హీరో ధనుష్, మమతా బైజూ జంటగా నటించిన ‘కర’ టీజర్ నేడు విడుదలైంది. విగ్నేష్ రాజా దర్శకత్వంలో తీసిన ‘కర’ ఈ నెల 30న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కేఎస్ రాజీవ్ కుమార్, కరునాస్, జయరామ్, ప్రిద్వి పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎంఎస్ భాస్కర్, శ్రీజ రవి ముఖ్యపాత్రలు చేశారు.
నా పేరు కరస్వామి. నన్ను కర అని పిలుస్తారు అంటూ ధనుష్ వాయిస్ ఓవర్‌తో టైటిల్ గురించి చెప్పేశారు. ఈ సినిమాకు సంగీతం: జీవి. ప్రకాష్ కుమార్, కెమెరా:థేని ఈశ్వర్, ఆర్ట్: మాయపండి, స్టంట్స్: దినేష్ కాశి, ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్ చేశారు.
వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్ బ్యానర్లపై డా.ఇషారి కే గణేష్, కుష్మిత గణేష్ కలిసి నిర్మించారు. ‘కర’ తెలుగు వెర్షన్ని విగ్నేశ్వర ఎంటర్‌టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిక్స్ కలిసి విడుదల చేస్తున్నాయి.