
ఇది పరాభవ నామ సంవత్సరం. ఈ కొత్త సంవత్సరంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీలో పరాభవాలు భరించలేక రాజీనామా చేస్తున్నానని అనుచరులకు లేఖ వ్రాశారు. ఇంకా ఈ అవమానాలు భరించే శక్తి నాకు లేదు. కనుక ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తున్నా. నా భవిష్యత్ రాజకీయ ప్రస్తానంలో మీ అందరి సహాయ సహకారాలు కావాలి నాకు,” అని లేఖలో వ్రాశారు.
ఆయనకి నచ్చజెప్పేందుకు మంత్రి అడ్లూరి లక్షణ్ తదితరులు జగిత్యాలలోని ఆయన నివాసానికి వెళ్ళి మాట్లాడారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగేందుకు ససేమిరా అన్నారు. జీవన్ రెడ్డి రాజీనామా చేయడం ఖాయమని తేల్చేశారు కనుక ఇప్పుడు బిజేపి, బీఆర్ఎస్ పార్టీలలో దేనిలో చేరబోతున్నారు? ఆ పార్టీలు ఆయనకు ఎలాంటి ఆఫర్ ఇచ్చాయనేది త్వరలో తెలుస్తుంది.