
తెలంగాణ ప్రభుత్వం నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాలలో రైతు భరోసా నిధులు జమా చేసింది. సిఎం రేవంత్ రెడ్డి లాంచనంగా ఈ పధకం ప్రారంభించారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిలలలలో రైతుల ఖాతాలలో ఎకరాకు రూ.6000 చొప్పున సొమ్ము జమా అయినట్లు మెసేజులు వచ్చాయి. ఈ పధకం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 9,000 కోట్లు కేటాయించింది. మూడు విడతలలో కలిపి మొత్తం 70 లక్షల మంది రైతులకు ఈ సొమ్ము చెల్లించబోతోంది. ఇదే విషయం తెలియజేస్తూ సిఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ సందేశం కూడా పెట్టారు.
రైతులకు ఆర్ధిక సాయం అందించడమే కాకుండా వారి కోసం పామాయిల్ పరిశ్రమ కూడా ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు. దీనికి కొనసాగింపుగా ఓ రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.