హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ కారిడార్

గత ప్రభుత్వ హయంలో హైదరాబాద్‌ అనేక ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయి. అయినప్పటికీ నానాటికీ జనాభా, వాహనాల రద్దీ పెరిగిపోతూనే ఉండటంతో అవేమాత్రం సరిపోవడం లేదు. కనుక హైదరాబాద్‌లో ఎల్బీ నగర్‌ నుంచి హయత్ నగర్‌ రేడియో స్టేషన్ వరకు ఓ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు తెలిపారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలిసి రూ.940 కోట్ల బడ్జెట్‌తో చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టుకి తెలంగాణ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

దీనిలో పైన మెట్రో కారిడార్ నిర్మిస్తారు. దాని కిందన వాహనాల రాకపోకలు సాగిస్తాయి. వాటి కింద యధాప్రకారం రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగిస్తాయి. కనుక ఈ డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయ్యి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. కానీ మూడేళ్ళలో ఇది పూర్తఃయ్యేసరికి మళ్ళీ జనాభా, వాహనాలు ఇంకా పెరుగుతాయి.