హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడంటే...

హైదరాబాద్‌లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నగరానికి కొత్త ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పుడు నగరంలో మరో కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మీర్ ఆలం చెరువు మీదుగా చింతల్మెట్ రోడ్డుని బెంగళూరు జాతీయ రహదారి 44 ని కలుపుతూ దీనిని నిర్మించబోతోంది. రూ.430 కోట్ల వ్యయంతో మీర్ ఆలం చెరువుపై 2.65 కిమీ పొడవు,  22.2 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మించబోతున్నారు. ఇప్పటికే దీని డిజైన్, టెండర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే సిఎం రేవంత్‌ రెడ్డి దీనికి శంకుస్థాపన చేయబోతున్నట్లు సమాచారం. ఇది కూడా వస్తే హైదరాబాద్‌ నగరానికి మరో కొత్త పర్యాటక ఆకర్షణగా మారుతుంది.