
డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఇటీవలే ‘పరాశక్తి’ సినిమాతో కోలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ సినిమాలో కోలీవుడ్ నటుడు కార్తికేయన్‌కి జోడీగా నటించి మెప్పించింది. అది సూపర్ హిట్ అవడంతో వెంటనే మరో తమిళ సినిమా అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది.
ఈసారి హీరో ధనుష్‌కి జోడీగా నటించబోతోంది. ఇది తమిళ సినిమా కనుక కోలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో దీనిని తెరకెక్కించబోతున్నారు. ధనుష్, శ్రీలీల ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే కనుక దీనిని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడం కూడా ఖాయమే.
త్వరలోనే పూజా కార్యక్రమం చేసి మార్చి నెలాఖరు నుంచి లేదా ఏప్రిల్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టవచ్చని తెలుస్తోంది. ఈ సినిమాకి సాయి అభయంకర్ సంగీత దర్శకుడు.