నిర్మలమ్మ బడ్జెట్‌లో హైదరాబాద్‌కు మూడు బహుమతులు

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు 2026-27 సం.ల వార్షిక బడ్జెట్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దానిలో దేశంలో ఏడు ప్రధాన నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైల్వే కారిడార్లు ప్రకటించారు. వాటిలో మూడు హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-పూణే ఉన్నాయి. మిగిలినవాటిలో ముంబాయి-పూణే, ఢిల్లీ-వారణాశి, వారణాశి-సిలిగుడి ఉన్నాయి. 

హైదరాబాద్‌ని చెన్నై, బెంగళూరు, పూణేలతో కలుపుతూ హైస్పీడ్ రైల్వే కారిడార్లు ఏర్పాటు అయితే మరిన్ని కొత్తవి, హైస్పీడ్ రైళ్ళు అందుబాటుకి వస్తాయి. 

దేశంలో ఏపీ, తమిళనాడు, కేరళ, ఓడిశా రాష్ట్రాలలో అరుదైన ఖనిజాలు ఉన్నందున వీటి కోసం ప్రత్యేకంగా రేర్ ఎర్త్ కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దేశంలో సెమీ కండెక్టర్‌ మిషన్ 2.0 పేరుతో ఆ రంగంలో అభివృద్ధి కోసం రూ.40,000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. దేశంలో కొత్తగా మూడు డెడికేటడ్‌ కెమికల్ రీసర్చ్ పార్కులు ఏర్పాటు చేస్తామని నిర్మలమ్మ ప్రకటించారు.