
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు 2026-27 సం.ల వార్షిక బడ్జెట్ లోక్సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ హోదాలో ఆమె 9వసారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఏకైక మహిళా ఆర్ధిక మంత్రిగా నిలుస్తున్నారు. గతంలో దివంగత ప్రధాని మొరార్జీ దేశాయ్ 10సార్లు, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మోడీ ప్రభుత్వం మరో మూడేళ్ళు అధికారంలో ఉంటుంది. కనుక నిర్మలమ్మ వారిరువురి రికార్డులు కూడా బ్రేక్ చేయడం ఖాయమే.
ప్రస్తుతం ట్రంప్ ఒత్తిళ్ళ కారణంగా భారత్ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అలాగే పారిశ్రామిక, వాణిజ్య, ఐటి కంపెనీలు తదితర రంగాలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ ప్రభావం సామాన్య ప్రజలపై కూడా పడుతోంది. కనుక నిర్మలమ్మ నేడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో నష్ట నివారణ, దిద్దుబాటు చర్యలు ఉండవచ్చు. ఎప్పటిలాగే ఈసారి ఆదాయపన్ను మినహాయింపులు ఉంటాయని కానీ ఈసారి అంత భారీగా ఉండకపోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.