
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. కనుక తన ప్రతాపం మునుగోడులోని వైన్ షాపులపై చూపుతున్నారు. తన నియోజకవర్గంలో వైన్ షాపులు మధ్యాహ్నం ఒంటి గంటకు, పర్మిట్ రూములు సాయంత్రం 6 గంటలకు మాత్రమే తెరవాలని హుకుం జారీ చేశారు.
అలాగే ఊళ్ళో వైన్ షాపులు ఉండరాదని అన్నీ ఊరు శివారులో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మునుగోడులో వైన్ షాప్ లైసెన్సులు పొందిన అందరూ తప్పనిసరిగా తన నియమ నిబంధనలు పాటించాల్సిందేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేశారు. ఆయన అనుచరులు బలవంతంగా వాటిని అమలు చేయిస్తున్నారు.
రెండు రోజుల క్రితం సంస్థాన్ నారాయణపూర్లో ఓ వైన్ షాప్ యజమాని తమ నిబంధనలు ఉల్లంగించినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు దాడి చేసి బలవంతంగా మూయించేశారు. వారి ఆగడాలు మితిమీరడంతో వైన్ షాపుల యజమానులు ఎక్సైజ్ శాఖ అధికారులకు పిర్యాదు చేశారు. వారు ఈరోజు ఉదయం అక్కడకు చేరుకొని వైన్ శాపులని తెరిపించారు. అయితే వారు ప్రతీరోజూ అక్కడ కాపలా ఉండలేరు. కనుక వారు అటు వెళ్ళగానే మళ్ళీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వచ్చి వైన్ షాపులు మూయించకుండా ఉంటారా? కనుక ఈ సమస్యని ప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉంటుంది.
మా సార్ చెప్పిన టైంకే వైన్ షాపులు తెరవాలి
లేదంటే షాపులు మొత్తానికి మూసేస్తాం
మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల ముందు వీరంగం సృష్టిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు
నియోజకవర్గంలో వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంటకు.. పర్మిట్ రూమ్ సాయంత్రం 6 గంటలకు తెరవాలని రాజగోపాల్… pic.twitter.com/AVB6TjoRAa
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ అధికారులు
మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి Vs లిక్కర్ వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు
సంస్థాన్ నారాయణపూర్లో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాపులను దగ్గరుండి తెరిపించిన ఎన్… https://t.co/1Nlu5lCdSO pic.twitter.com/Y34oq1vU1X