
ఈ నెల 19 నుంచి 23వరకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగబోతోంది. సిఎం రేవంత్ రెడ్డి, అధికారుల బృందం ఈ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 17వ తేదీ రాత్రి దావోస్ పర్యటనకు బయలుదేరబోతున్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 15 రోజులకే దావోస్ పర్యటనకు వెళ్ళి భారీగా పెట్టుబడులు సాధించుకొచ్చారు.
ఈ మూడేళ్ళలో సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పార్టీ, రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు సాధించారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ రాష్ట్రాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడబోదని బలమైన సంకేతాలు ఇవ్వగలిగారు.
కనుక ఈసారి దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు సాధించుకు వచ్చే అవకాశం ఉంది. దావోస్ నుంచి సిఎం రేవంత్ రెడ్డి టీమ్ నేరుగా అమెరికా వెళ్ళి అక్కడ కూడా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలన్నిటినీ సమీక్షిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే హెచ్చరిస్తున్నారు. కనుక రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి అటువంటి సమస్య ఉండబోదని సిఎం రేవంత్ రెడ్డి బృందం నమ్మకం కల్పించాల్సి ఉంటుంది.
ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ పర్యటనకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు
— Telangana Congress (@INCTelangana) January 14, 2026
ఈ నెల 19 నుంచి 23 డబ్ల్యూఈఎఫ్–2026 సదస్సు
దావోస్ నుంచి అమెరికా పర్యటనకు సీఎం గారు
అక్కడ పలు సంస్థల ప్రతినిధులతో భేటీ
ఏకబిగిన 13 రోజుల్లో రెండు దేశాల పర్యటన పెట్టుబడులకు ఆహ్వానం… pic.twitter.com/QdJDQIjsa8