
వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేడు ని నేతలు, జిల్లా అధికారులతో కలిసి యోజకవర్గంలో నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పరిశీలించడానికి వెళ్ళారు. అయన ఓ బిల్డింగ్ బేస్మెంట్ మీద నిలబడి అధికారులతో మాట్లాడుతూ ఉండగా హటాత్తుగా అది క్రుంగిపోయింది. దాంతో అయన కిందన పడబోయారు. కానీ చుట్టూ ఉన్నవారు ఆయనకు చెయ్యందించి కింద పడిపోకుండా కాపాడి బయటకు లాగారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, “డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఇంత నాసిరకంగా జరుగుతోందా? ఓ మనిషి నిలబడితే ఫ్లోరింగ్ క్రుంగిపోతే రేపు లబ్దిదారులు వచ్చి వాటిలోనే నివసించగలరు?” అంటూ నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
బహుశః బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా విమర్శించక మానరు. కనుక భావన నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే ఈ దశలోనే సరి చేసుకోవడం మంచిది. లేకుంటే తర్వాత కూలిపోతే చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.