
ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాశి టైటిల్ గ్లిమ్స్ విడుదల సందర్భంగా రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ వంటివారు మండిపడుతుంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ చాలా హుందాగా స్పందించారు.
“అది ఆయన ఆలోచన. ఎవరి ఆలోచన వారిది. భవిష్యత్తులో అయన దైవంపై నమ్మకం కలిగించాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. భవిష్యత్తులో అయనకు తప్పక దైవభక్తి కలుగుతుందని ఆశిస్తున్నాను. అయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.
రాజాసింగ్ మాట్లాడుతూ, “రాజమౌళికి దేవుడిపై భక్తీ లేదంటారు. ఆయనకు దేవుడు, హిందూమతంపై నమ్మకం లేకపోతే హిందూ దేవుళ్ళని తన సినిమాలలో ఎందుకు వాడుకుంటున్నారు?
హిందూ దేవుళ్ళని సినిమాలలో వాడుకొని కోట్లు సంపాదించుకుంటారు. హిందువులు అయన తీసే చెత్త సినిమాలన్నీ చూసి ఆనందిస్తున్నారు. వందలు, వేలకోట్లు కుమ్మరిస్తున్నారు. ఈ ధైర్యంతోనే అయన ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
హిందువులందరూ ఆయన తీసే చెత్త సినిమాలు చూడటం మానేస్తే ఆయనకే తెలిసివస్తుంది. ఇలాంటి నాస్తికులకు హిందువులు గట్టిగా బుద్ధి చెప్పాలి,” అని రాజాసింగ్ అన్నారు.
రాజమౌళి వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్
రాజమౌళి నిండు నూరేళ్ళు బ్రతికి మంచిగా సక్సెస్ అవ్వాలని అమ్మవారిని కోరుతున్నా
దేవుడు కరుణించి రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా మార్చి.. ఆయన కరుణ కటాక్షాలు రాజమౌళిపై ఉండాలని కోరుకుంటున్నా - బండి సంజయ్ https://t.co/nOqUierrHk pic.twitter.com/5XUG3ykUFn