కల్వకుంట్ల కవిత రైలు ప్రయాణం!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి రైల్లో ఖమ్మం వెళుతున్నారు. జాగృతి జనం బాట పేరిట ఆమె జిల్లా పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఖమ్మంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రైల్లో బయలుదేరివెళుతున్నారు. 

ఆమెను సికింద్రాబాద్‌ స్టేషన్‌లో చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కొంతమంది ఆమెతో సెల్ఫీలకు ప్రయత్నించినా సమయం లేకపోవడం వారిస్తూ ముందుకు సాగిపోయారు. 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆమె హరీష్ రావు, అన్న కేటీఆర్‌ని తీవ్రంగా విమర్శించారు. వారిరువురూ స్పందించలేదు. పార్టీ తరపున కూడా ఎవరూ ఆమె మాటలను ఖండించలేదు.

స్పందిస్తే ఆమె మరిన్ని విషయాలు మాట్లాడితే తామే మరింత ఇబ్బంది పడవలసి వస్తుందని కావచ్చు. లేదా ఆమెకి దీటుగా జవాబులు చెపుతుంటే ప్రత్యర్ధులు, మీడియా ఈ వివాదాన్ని మరింత పెంచి పెద్దది చేస్తారని కావచ్చు.

కానీ కల్వకుంట్ల కవిత మాత్రం ప్రజల సమస్యలు, వారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలను విమర్శించడానికి వెనకాడటం లేదు. బహుశః రేపు ఖమ్మం పర్యటనలో కూడా అదే చేస్తారేమో?