కేసీఆర్‌ కళ్ళకు హరీష్ గంతలు కట్టారు: కవిత

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటమితో బీఆర్ఎస్‌ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇంతకాలం మౌనంగా ఉంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రెస్‌మీట్‌ పెట్టి వరుసగా సంచలన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

మొదట హరీష్ రావుని టార్గెట్ చేసుకొని ఆయన పార్టీని ముంచేస్తున్నారని ఆరోపించిన కవిత, తర్వాత ఆయన రైతులను ఏవిదంగా దెబ్బ తీశారో వివరించారు.

ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ఆమె రెడ్డిపల్లి గ్రామంలో పర్యటించినప్పుడు, అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటి గురించి మాట్లాడుతూ, హరీష్ రావు, నవీన్ యాదవ్‌ రావు, గంగుల కమలాకర్ ముగ్గురూ ఆ ప్రాంతంలో గల తమ భూములను కాపాడుకునేందుకు ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్చేశారని ఆరోపించారు.

గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం అక్కడ హరీష్ రావుకు 400 ఎకరాలు దానిలో ఓ ఫామ్‌హౌసు, రిసార్ట్ ఉన్నాయి. మరో చోట గంగుల కమలాకర్‌కి 15 ఎకరాలు, నవీన్ రావుకి 18 ఎకరాలు ఉన్నాయని చెప్పారు.

అక్కడ వరకు తిన్నగా వచ్చిన అవుటర్ రింగ్ రోడ్ వారి ముగ్గురు భూములు దగ్గరకు వచ్చేసరికి పాములా మెలికలు తిరిగి, పక్కనే ఉన్న 56 మంది నిరుపేద రైతులకు చెందిన 59 ఎకరాలు మీదుగా సాగిందన్నారు. దాంతో పావు, అర, ఎకరం కలిగిన ఆ రైతులందరూ భూములు కోల్పోయి రోడ్డున పడ్డారని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

ముగ్గురు బీఆర్ఎస్‌ నేతలు తమ భూములు కాపాడుకోవడానికి, వాటి విలువ పెంచుకోవడానికి పేద రైతులకు తీరని అన్యాయం చేశారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

ఈ విషయం కేసీఆర్‌కి తెలిస్తే ఒప్పుకోరు కనుక అయన కళ్ళకు గంతలు కట్టి కధ నడిపించేశారని ఆరోపించారు. అందువల్లే మెదక్ జిల్లలో బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోయిందని కల్వకుంట్ల కవిత అన్నారు.

హరీశ్‌‌రావు కోసం RRR అలైన్‌మెంట్ మార్చారు: కవిత

హరీశ్రరావుపై కల్వకుంట్ల కవిత మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. హరీశ్ ఫాంహౌస్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నవీన్ రావు భూములను రక్షించడానికి RRR అలైన్మెంట్ మార్చారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెడ్డి పల్లి, చిప్పలతుర్తి, తుంకి మధ్య… pic.twitter.com/0LfHFo8osO
— ChotaNews App (@ChotaNewsApp) November 15, 2025

video courtesy: Chota News App: