బీ టీమ్‌ కాదు... కింగ్ మేకర్: అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్‌, పాతబస్తీకే పరిమితమనుకున్న మజ్లీస్ పార్టీ బీహార్‌ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి 5 సీట్లు గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీని బీ-టీమ్‌ పార్టీ అంటూ అవహేళన చేసిన వారికి ఇదే మా జవాబు.

నిజానికి రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే మాతో దోస్తీ తప్పదు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ మాతో దోస్తీ చేసింది. ఎన్నికలో గెలిచింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా పార్టీ మూతపడుతుందన్నారు చాలా మంది. కానీ ఆయన మా సాయంతో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకున్నారు.  

బీహార్‌లో కాంగ్రెస్‌, బీజేపి కూటమిలని తప్ప మీడియా, ప్రజలు మరెవరినీ పట్టించుకోలేదు. కానీ అలాంటి పరిస్థితిలో కూడా మేము అక్కడ 5 సీట్లు గెలుచుకున్నాము. చాలా కాలంగా ఈ రాజకీయాలలో ఉన్నాను. బాగా అలిసిపోయాను. సమర్దుడైన నాయకుడు ఎవరైనా ముందుకు వస్తే రాజకీయాల నుంచి తప్పుకొని శేష జీవితం ప్రశాంతంగా జీవించాలని ఉంది,”అని అన్నారు.