దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు: ప్రధాని మోడీ

ప్రస్తుతం భూటాన్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ నిన్న ఢిల్లీలో జరిగిన కారు బాంబు దాడిపై తీవ్రంగా స్పందించారు. ఈ దాడి వెనుక ఉన్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై కటిన చర్యలు తీసుకుంటామని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. దర్యాప్తు సంస్థలు విచారణ పూర్తయితే ఈ దాడి వెనుక ఎవరున్నారనేది స్పష్టమవుతుందని, అప్పుడు వారిపై తప్పకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ కూడా ఇంచుమించు ఈవిదంగానే చెప్పారు. 

ఇటీవల నిఘా బృందాలు హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్‌లో సోదాలు జరిపి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేసి వారి ఇంట్లో నుంచి ఆయుధాలు, భారీగా ప్రేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. 

దాంతో అప్రమత్తమైన డా.ఒమర్ మహ్మద్‌ వెంటనే కారులో ప్రేలుడు పదార్దాలు నింపుకొని సోమవారం ఫరీదాబాద్‌ నుంచి బయలుదేరి ఉదయం 10.30-11 గంటల మద్య ఢిల్లీలో ప్రవేశించాడు. అప్పటి నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆగకుండా తిరుగుతూనే ఉన్నాడు. 

తర్వాత ఎర్రకోట మెట్రో స్టేషన్‌ వద్ద వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో కారు పార్క్ చేసి సాయంత్రం 6.30 గంటల వరకు దానిలోనే కూర్చొన్నాడు. అక్కడి నుంచి 6.30 గంటలకు బయలుదేరి, రెడ్‌ సిగ్నల్ పడినప్పుడు కారులో ఉన్న బాంబులను డిటోనేటర్ సాయంతో పేల్చేసి ఆత్మహుతి దాడికి పాల్పడినట్లు సీసీ కెమెరా రికార్డింగుల ద్వారా పోలీసులు కనుగొన్నారు. 

తాజా సమాచారం ప్రకారం జాతీయ దర్యాప్తు బృందాలు ఫరీదాబాద్‌లో డా.ఒమర్ మహ్మద్‌ కుటుంబ సభ్యులను అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఈ దాడికి మేమే కారణమని ఏ సంస్థ ఇంతవరకు ప్రకతిన్చుకోలేదు. కనుక నిఘా సంస్థ దర్యాప్తు పూర్తయితే ఈ దాడికి ఎవరు కుట్ర చేశారో తెలుస్తుంది.