జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఆ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం. ఈ స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సోమవారం సిఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావనకు రాగా, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, గడ్డం వివేక్ ముగ్గురు మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించ వలసి ఉంది.
దానం నాగేందర్ వంటి కొందరు పార్టీని వీడి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో హైదరాబాద్‌లో కూడా బిఆర్ఎస్ పార్టీ బలహీనపడినట్లయింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో రెండుసార్లు వరుస పరాజయాలు ఎదుర్కొన్న బిఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో తప్పనిసరిగా గెలవడం ఎంత ముఖ్యమో ఈ స్థానం తిరిగి దక్కించుకోవడం కూడా అంతే ముఖ్యం.
ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ సీటు దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీజేపిలు కూడా గట్టిగానే కృషి చేస్తాయి. కనుక పోటీ తీవ్రంగానే ఉండవచ్చు.