అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సిఎం?

ఈరోజు మద్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన లండన్‌లో స్థిరపడిన తన కుమార్తెల వద్దకు బయలుదేరినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన విమానంలో ప్రయాణిస్తున్నవారి బోర్డింగ్ లిస్టులో విజయ్ రూపాని పేరు కూడా ఉంది.

మద్యాహ్నం 12.10 గంటలకు ఆయన పేరిట బోర్డింగ్ పాస్ జారీ చేసినట్లు రికార్డులో ఉంది. కనుక ఈ ప్రమాదంలో ఆయన కూడా చనిపోయి ఉండవచ్చు లేదా క్షతగాత్రులలో ఉండవచ్చు. ఈ విషయం తెలిసిన వెంటనే గుజరాత్ ప్రభుత్వం రూపాని ఆచూకీ కనుగొనేందుకు అధికారులను పంపించింది. 

విమాన ప్రమాదం జరగడంతో సాయంత్రం 5 గంటల వరకు అహ్మదాబాద్‌ విమానాశ్రయం మూసివేసి, విమానాలను రీ షెడ్యూల్‌ చేస్తున్నారు. మృతుల సంఖ్య 110కి చేరినట్లు తాజా సమాచారం.