శుక్రవారం రాత్రి 7.30కి కల్వకుంట్ల కవిత ప్రెస్‌మీట్‌

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌ తీరుపై నిశితంగా విమర్శిస్తూ వ్రాసినట్లు చెప్పబడుతున్న లేఖపై సర్వత్రా చర్చలు జరుగుతుండటంతో, ఈరోజు రాత్రి 7.30 గంటలకు అమెరికా నుంచి హైదరాబాద్‌, శంషాబాద్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

హనుమకొండ సభలో కేసీఆర్‌ కేంద్రం, బీజేపి ప్రస్తావన చేయకుండా మెతక వైఖరి ప్రదర్శించడం ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళాయని, పార్టీలో బాధ్యతలు, పదవులు పంపకంలో కొందరికి మాత్రమే ప్రయోజనం పొందుతున్నారంటూ కల్వకుంట్ల కవిత తన లేఖలో ఇంకా చాలా విషయాలు ప్రస్తావించారు. 

ఆ లేఖ బయటకు పొక్కడంతో కాంగ్రెస్‌, బీజేపి నేతలు, సోషల్ మీడియాలో రకరకాల వాదనలు, విమర్శలు వినిపిస్తున్నాయి. 

కనుక కొడుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఇవన్నీ జరిగాయి. కనుక హైదరాబాద్‌లో దిగగానే మొట్టమొదట తన లేఖపై కల్వకుంట్ల కవిత వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులు ఆమె కోసం శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఎదురుచూస్తున్నారు. ఆమె ఏమి చెపుతారోనని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు.