తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణ రావు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణ రావుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా చేస్తున్న శాంతి కుమారి ఈ నెల 30 వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు.

ఆమె స్థానంలో సీనియరిటీ ప్రకారం ఆర్ధికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న కె రామకృష్ణ రావు పేరు ఖరారు చేసింది. 1991 బ్యాచ్‌కి చెందిన కె రామకృష్ణ రావు 2014 నుంచి ఆర్ధికశాఖని అత్యంత సమర్ధంగా నిర్వహిస్తున్నారు. కనుక ఆయన సీనియారిటీ, అనుభవం, సమర్దత మూడు పరిగణనలోకి తీసుకొని సిఎం రేవంత్ రెడ్డి ఆయన పేరు ఖరారు చేశారు. 

పనిలో పనిగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదస్పద ట్వీట్స్ చేసిన పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌పై బదిలీ వేటు పడుతుందని అందరూ అనుకున్నదే. ఆమెను ఫైనాన్స్ కమీషన్ మెంబర్ సెక్రెటరీగా బదిలీ చేసింది.